రెడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌తో ప్రపంచ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సహజీవనం చేస్తోంది. అలెక్సిస్‌తో సహజీవనానికి గుర్తుగా త్వరలో తనకు అమ్మతనం లభించనుందని... తాను 20వారాల గర్భవతిని అని సెరెనా ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాను గర్భవతిని అనే విషయాన్ని ఎందుకు బహిర్గతం చేసివుండకూడదంటోంది. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పొరపాటున బయటపెట్టానని చెప్తోంది.
గర్భవతి అనే విషయం బయటికి తెలిస్తే.. లేనిపోని కథనాలు రాస్తారని.. అందుకే బయటపెట్టాల్సి వచ్చిందని సెరెనా వివరించింది. కానీ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడినప్పుడు తాను గర్భవతిని అనే విషయం ఆలోచించలేదని.. టోర్నీ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని చెప్పుకొచ్చింది. అమ్మతనం అనేలో జీవితంలో ఓ భాగమేనని.. బేబీ పుట్టిన తర్వాత మైదానంలో ఆడుతానని సెరెనా వెల్లడించింది.