పారిస్ ఒలింపిక్స్ 2024లో మెరిసిన తెలుగు తేజాలు.. శ్రీజ అదుర్స్

సెల్వి

బుధవారం, 31 జులై 2024 (20:39 IST)
Sreeja Akula
పారిస్ ఒలింపిక్స్ 2024లో తెలుగమ్మాయి, భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ మెరిసింది. తన పుట్టిన రోజైన జూలై 31న జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల రౌండ్ 32 మ్యాచ్‍లో అదరగొట్టింది. ఈ రౌండ్‍లో విజయం సాధించి ప్రీ-క్వార్టర్స్ చేరారు. 
 
ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ చేసిన రెండో భారత ప్లేయర్‌గా శ్రీజ చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మ్యాచ్‍లో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో సింగపూర్ ప్లేయర్ జియాన్ జెంగ్‍పై విజయం సాధించారు. 
 
మరోవైపు భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవి సింధు కూడా పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రీ-క్వార్టర్స్ చేరారు. భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ దుమ్మురేపాడు.

పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల సింగిల్స్ రౌండ్ 32 మ్యాచ్‍లో అద్భుత ఆట తీరుతో విజయం సాధించాడు. నేడు జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్‍లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీని 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో 22 ఏళ్ల లక్ష్యసేన్ ఓడించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు