ముఖ్యంగా, డోప్ టెస్టుల్లో పట్టుబడిన తమ దేశ క్రీడాకారుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు తప్పుడు ఆధారాలు చొప్పించడంతో పాటు... పాజిటివ్‌గా వచ్చిన డోపింగ్ టెస్టులకు సంబంధించిన ఫైళ్లను డిలీట్ చేసినట్టు నిర్ధారణ కావడంతో డబ్ల్యూఏడీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కఠిన నిర్ణయం తీసుకుని, రష్యాపై వేటు వేసింది.
కాగా రష్యాపై నిషేధం విధించేందుకు డబ్ల్యూఏడీఏ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తాజా నిర్ణయంతో రష్యా ఒలింపిక్స్‌తో పాటు 2020 సమ్మర్ గేమ్స్, బీజింగ్‌లో జరిగే 2022 వింటర్ గేమ్స్ తదితర ప్రపంచ క్రీడలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.