మిథాలీ రాజ్ నెక్ట్స్ టార్గెట్ అదేనా? గ్లామర్ ఫోటోలు వెనుక...

సోమవారం, 20 నవంబరు 2017 (20:52 IST)
ఏం ఇండస్ట్రీలో స్టార్ అయినప్పటికీ సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. 
 
ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా సినీ అరంగేట్రం చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇటీవలి ఆమె ఇచ్చిన ఫోటోలు మరింత గ్లామర్ అద్దడంతో నిజమయ్యే అవకాశాలున్నాయనే కామెంట్లు వినబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు