ఆదివారం వేళ గోకులాష్టమి... సకల శుభాలకు మూలం

FILE
కృష్ణుని జన్మదినమైన కృష్ణాష్టమి ఆదివారం వేళ వస్తే ఎంతో శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది కృష్ణాష్టమి ఆదివారం వస్తుండడం భక్తులకు చాలా ఆనందాన్ని కల్గిస్తోంది.

ఇలాంటి శుభప్రదమైన వేళ ప్రత్యేక పూజలతో కృష్ణుని సేవిస్తే ఆ లీలా మానస చోరుడు తప్పక అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేళ మద్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాలు రెండింటిని పూజకు ఉపయోగించాలి.

పూజకు ఉపక్రమించే సమయంలో సింధూరాన్ని నుధుటిన ధరించి తులసి మాలను మెడయందు ధరించాలి. అటుపై తులసి మాలతో కూడిన శ్రీకృష్ణుని ప్రతిమ ముందు తూర్పు వైపుగా కూర్చుని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని 108 సార్లు జపించాలి. అనంతరం ఆ దేవదేవును పంచామృతాలతో అభిషేకించాలి. ఇలా చేస్తే ఆ గోపికా లోలుడు మిమ్ములను సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి