కృష్ణాష్టమి: భక్తులతో పోటెత్తిన శ్రీవారి ఆలయం

FILE
కృష్ణాష్టమి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమలేశుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవులతో పాటు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనం కోసం వేచివుండే కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

దీంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నేడు ఆలయంలో జరిగే గోకులాష్టమి ఆస్థానం, ఉట్లోత్సవం సందర్భంగా ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా వెంకన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో తితిదే అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. నేటి నుంచి మూడు రోజులు సెలవులు కావడంతో తితిదే అప్రమత్తమైంది. లడ్డూల కొరత రానివ్వకుండా తితిదే యంత్రాంగం తగినన్ని నిల్వచేసింది.

వెబ్దునియా పై చదవండి