భూభారాన్ని తగ్గించడానికే శ్రీకృష్ణ అవతారం..!!

శుక్రవారం, 10 ఆగస్టు 2012 (17:54 IST)
WD
నేడు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని జన్మదినం. ఆ పరమాత్మ జననం తోటిదే లోకం పావనమయింది. ఇంకా కలుపు మొక్కల్లా భువిపై సంచరిస్తున్న అసురులను సంహరించి లోక కల్యాణం కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు.

శ్రీకృష్ణావతారంలో కృష్ణపరమాత్మ ఎంతోమంది కష్టాలను తొలగించడమే కాకుండా మరెందరి భవబంధ విముక్తులను చేయడానికి పూనుకున్నాడు. మునుపు రామావతారంలో ఎంతోమందికిచ్చిన వాగ్దానాలు, వరాలు శ్రీకృష్ణునిగా తీర్చడం జరిగింది.

ఈ విధంగా శ్రీకృష్ణుని ద్వారా ద్వాపరంలో జరిగిన ప్రతీ చర్య, ప్రతీ లీల భూ భారాన్ని తగ్గించడానికి, కొందరికి ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి, శాప విమోచనాలు చేయడానికీ, ధర్మ సంస్థాపనకీ దారితీస్తూ భగవత్తత్వాన్ని వెల్లడించేట్లుగా స్పష్టమవుతుంది.

వెబ్దునియా పై చదవండి