అమృతఫలం డైమండ్స్

కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
కొబ్బరికాయ... ఒక
బెల్లం... అరకేజీ
యాలక్కాయలు... ఐదు
నెయ్యి... తగినంత

తయారీ విధానం :
బియ్యాన్ని ఆరు లేదా ఏడుగంటలసేపు నానబెట్టి... కొబ్బరితో కలిపి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. స్టౌమీద గిన్నెపెట్టి, అందులో బెల్లం వేసి కొద్దిగా నీటిని పోయాలి. బెల్లం కరిగిన తరువాత యాలక్కాయలపొడి, రుబ్బిన పిండి వేసి సన్నటి మంటమీద అడుగంటకుండా ఉడికించాలి.

ఈ మిశ్రమాన్ని ఉండకట్టకుండా కలుపుతూనే ఉండాలి. కమ్మటి బెల్లం వాసన వస్తుండగా దించేసి... ఓ వెడల్పాటి పళ్లానికి నెయ్యిరాసి ఉడికించిన మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి. దానిపై మిగిలిన నెయ్యిని పోసి మిశ్రమం అంతటా పరచుకునేలా చేయాలి.

పళ్లెంలోని పదార్థం చల్లారిన తరువాత డైమండ్స్ ఆకారంలో కోసి అవసరమయితే డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి. కర్ణాటక ప్రాంతంలో ఈ వంటకాన్ని పెద్దలు ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్‌గానూ, సాయంత్రానికి పిల్లలకు స్నాక్స్‌లాగాను ఇస్తుంటారు. మరి మీరూ...?!

వెబ్దునియా పై చదవండి