కావలసిన పదార్థాలు : దోర జామకాయలు... అరకిలో పంచదార... అరకిలో వెన్న... 150గ్రా. జీడిపప్పు... 25 గ్రా. మిఠాయిరంగు... చిటికెడు
తయారీ విధానం : దోర జామపండ్లను 4 ముక్కలుగా కోసి స్పూనుతో గింజల్ని తొలగించాలి. ఓ గిన్నెలో నీరు పోసి పండ్లముక్కల్ని వేసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడగానే దించి నీళ్లు వంపేసి ఉంచాలి. చల్లారిన తరవాత మిక్సీలో వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో పంచదార, మిఠాయిరంగు కలిపి ఉడికించాలి.
హల్వాలా దగ్గరగా ఉడకగానే అందులో వెన్న వేసి ఇంకేవరకూ వేయించాలి. తరవాత దీన్ని నెయ్యి రాసిన ట్రేలో పోసి చల్లారిన తరవాత ముక్కలుగా కోసి బటర్పేపర్తో చుడితే చాలారోజులు నిల్వ ఉంటుంది. వెరైటీ రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.