కావలసిన పదార్థాలు : గోధుమపిండి... అరకేజీ నెయ్యి... ఒక కేజీ బెల్లం... ఒక కేజీ డ్రైఫ్రూట్స్... అరకప్పు
తయారీ విధానం : కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి అందులో గోధుమపిండి వేసి బాగా వేయించాలి. తరవాత బెల్లం తురుము కూడా వేసి మిగిలిన నెయ్యి కూడా వేసి ఉండలు కట్టకుండా మైసూర్‌పాక్‌లా చిక్కబడేవరకూ కలియదిప్పాలి.
ఓ వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి ఉంచాలి. పిండి బాగా ఉడికి మంచి వాసన వస్తుండగా దించి పళ్లెంలో వేసి గరిటెతో బాగా అదిమి ఆరిన తరవాత ముక్కలుగా కోయాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరిస్తే రాజస్థానీ పాపడి రెడీ అయినట్లే...!