పెసరతో తీపి పొంగలి

కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
నీరు... అర లీటర్
చిక్కటిపాలు... అర లీ.
బెల్లం తురుము... అర కేజీ
ఛాయ పెసరపప్పు... పావు కేజీ
నెయ్యి... వంద గ్రా.
జీడిపప్పు... వంద గ్రా.
ఎండుద్రాక్ష... 50 గ్రా.
యాలక్కాయలు... కొద్దిగా
పచ్చకర్పూరం... చిటికెడు

తయారీ విధానం :
బియ్యం కడిగి ఉంచాలి. బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి పాకం రానిచ్చి కర్పూరం, దంచిన యాలకులు వేసి కలపాలి. మందపాటి గిన్నెలో పాలు, నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టాలి. అందులో బియ్యం, పెసరపప్పు వేయాలి. బియ్యం సగం ఉడికిన తరవాత బెల్లంపాకం పోయాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష నేతిలో వేయించి పొంగలిలో కలపాలి.

పొంగలి ఉడికి చిక్కపడుతుండగా సెగ తగ్గించి నెయ్యి పోసి మూత పెట్టి ఉంచాలి. పది నిమిషాల తరవాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పొంగలిని కలియబెట్టి మళ్లీ గట్టిగా మూత పెట్టాలి. అంతే.. నెయ్యి, పచ్చకర్పూరం, బెల్లం సువాసనలతో కమ్మని తియ్యని పొంగలి తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి