కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ... నాలుగు కప్పులు అరటిపండ్లు... రెండు నెయ్యి... అరకేజీ పెరుగు... రెండు కప్పులు పంచదార... ఒక కప్పు
తయారీ విధానం : వెడల్పాటి పాత్రలో బొంబాయిరవ్వ, అరకప్పు నెయ్యి, అరటిపండ్ల గుజ్జు వేసి బాగా కలపాలి. మరోపాత్రలో పెరుగు, పంచదార పొడి కలపాలి. అందులో బొంబాయిరవ్వ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాలు నాననివ్వాలి.
స్టవ్‌మీద కడాయి పెట్టి మంట మరీ ఎక్కువా, తక్కువా కాకుండా చూడాలి. మిగిలిన నెయ్యి కడాయిలో వేసి కాగాక... పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అరచేతిలో చిన్న చిన్న బిళ్లలుగా వత్తి నేతిలో రెండువైపులా వేయించి తీయాలి. చివరగా ఇష్టమైతే వీటిమీద యాలకులపొడి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.