కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం... రెండు కప్పులు నీరు... నాలుగు కప్పులు పంచదార... మూడు కప్పులు ఎండుద్రాక్ష... నాలుగు టీ. కుంకుమపువ్వు... ఒక టీ. నెయ్యి... అర కప్పు యాలకుల పొడి... అర టీ. బాదం, పిస్తా, జీడిపప్పులు... అరకప్పు
తయారీ విధానం : బియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి మూడొంతులు ఉడికించి దించాలి. కడాయిలో నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడి పప్పు ముక్కలు వేసి వేయించాలి. అందులో అన్నం, పంచదార, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష వేసి కలిపి తడి పూర్తిగా పోయేవరకూ సన్నని సెగమీద మగ్గనిచ్చి దించాలి. తియ్యతియ్యగా ఉండే ఈ అన్నాన్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.