మ్యాంగో మిల్క్ హల్వా

కావలసిన పదార్థాలు :
మామిడి పళ్ళరసం... 8 కప్పులు
చక్కెర... ఒక కేజీ
పాలు... 5 కప్పులు
నెయ్యి... ఒక కేజీ
బాదం పప్పు... అర కప్పు
ఎండు ద్రాక్ష... తగినన్ని

తయారీ విధానం :
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడి చేయాలి. మధ్యస్థమైన మంటపై... మిశ్రమం బాగా గట్టిపడేదాకా, వీటిని బాగా కలియతిప్పుతూ ఉండాలి. ఇది లేహ్యం మాదిరిగా తయారు కాగానే.. నెయ్యి చేర్చి, పాత్ర అంచులకు అంటుకుపోకుండా కలియబెట్టాలి. ఇప్పుడు కాస్త నూనెను ఒక పళ్లానికి రాసి... పై మిశ్రమాన్ని పోసి, పైన బాదంపప్పులు, ఎండుద్రాక్షలతో అలంకరించాలి. అంతే వేడి వేడి మ్యాంగో మిల్క్ హల్వా సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి