"రవ్వ పూర్ణాలు" ఆరగించ రారండి...!

FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ.. అర కేజీ
నీళ్లు.. ఒక లీ.
పంచదార.. 600 గ్రా.
నూనె.. తగినంత
నెయ్యి.. వంద గ్రా.
యాలకుల పొడి.. 5 గ్రా.
మైదా.. 400 గ్రా.
కార్న్‌ఫ్లోర్.. 50 గ్రా.
లెమన్ ఫుడ్ కలర్.. పావు టీ.
ఉప్పు.. తగినంత
బియ్యంపిండి.. 50 గ్రా.

తయారీ విధానం :
బొంబాయి రవ్వను శుభ్రంచేసి నేతిలో దోరగా వేయించి ఉంచాలి. ఎసరు నీళ్లను మరిగించి లెమన్‌ కలర్‌, యాలకులపొడి, ఉప్పు వేయాలి. తరువాత గరిటెతో వేగంగా తిప్పుతూ రవ్వ కూడా పోయాలి. మూడు వంతులు ఉడికాక పంచదార పోసి సన్నని సెగమీద మగ్గనిచ్చి గట్టిపడుతుండగా గిన్నె దించాలి. రవ్వ బాత్‌ చల్లారాక చిన్న సైజులో లడ్డూలు చుట్టాలి.

మైదా, కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్‌ పౌడర్‌, కొద్దిగా బెల్లం తురుము వేసి చిక్కగా గుజ్జులా కలిపి పూతపిండిలా చేయాలి. ఈ పిండిని అలాగే పది నిమిషాలు ఉంచి తరవాత రవ్వబాత్‌ ఉండల్ని అందులో ముంచి నూనెలో వేయించి తీయాలి. అంతే రవ్వ పూర్ణాలు తయార్..!!

వెబ్దునియా పై చదవండి