కావలసిన పదార్థాలు : కొబ్బరికాయలు... రెండు పంచదార... 600 గ్రా. యాలకులు... ఎనిమిది రోజ్‌కలర్... నాలుగు చుక్కలు జీడిపప్పు... నాలుగు టీ. నెయ్యి... నాలుగు టీ.
తయారీ విధానం : కొబ్బరిని సన్నగా తురమాలి. ఓ బాణలిలో తురిమిన కొబ్బరి, పంచదార వేసి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తరవాత రోజ్ కలర్, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అంగుళం మందం వచ్చేలా ప్లేటంతా పరిచి పైన జీడిపప్పు అంటించి, ఆరిన తరవాత ముక్కలుగా కోయాలి. అంతే రోజ్ కోకోనట్ బర్ఫీ రెడీ అయినట్లే..!