కావలసిన పదార్థాలు : శెనగపప్పు.. అర కప్పు బాదంపప్పులు.. పది పాలు.. రెండున్నర కప్పులు పంచదార.. ఒకటిన్నర కప్పు నెయ్యి, జీడిపప్పు పలుకులు.. ఒక టీ. యాలకుల పొడి.. అర టీ. వంట కర్పూరం.. చిటికెడు
తయారీ విధానం : శెనగపప్పును నూనె లేకుండా బాణలిలో ఎర్రగా వేయించాలి. చల్లారాక నీటిలో కాసేపు నానబెట్టాలి. బాదంపప్పును విడిగా వేడినీటిలో నానబెట్టాలి. కాసేపయ్యాక బాదంపప్పు పొట్టు తీసివేసి, ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు సన్నని మంటపై మరో పాత్ర ఉంచి రెండు కప్పుల నీరు.. ఆ తర్వాత ఈ మిశ్రమం వేసి, ఉండలు కట్టకుండా తిప్పాలి.
పప్పు నుంచి పచ్చి వాసన పోయేంతదాకా అలాగే ఉంచి, పంచదార కలపాలి. పంచదార కరిగిన తరువాత అందులో పాలను కలిపి రెండు లేదా మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. చివర్లో వంటకర్పూరం, యాలకుల పొడిని కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.