కావలసిన పదార్థాలు : గోధుమపిండి... 300 గ్రా. పంచదార... 300 గ్రా. పాలు... ముప్పావు లీటర్ నెయ్యి... 400 గ్రా. కిస్‌మిస్... పది గ్రా. జీడిపప్పు... 20 గ్రా. యాలకులు... పది ఎండు ద్రాక్ష... పది గ్రా.
తయారీ విధానం : ఒక బాణలిలో నెయ్యి వేసి గోధుమ పిండిని అందులో వేయించాలి. వేగిన తరవాత అందులో వేడి పాలు పోయాలి. పాలన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాలి. తరువాత పంచదారను కూడా వేసి అది పూర్తిగా కరిగేంతవరకు ఉంచి దించాలి. చివరగా కిస్‌మిస్, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష వేసి కలిపితే వీట్ మిల్క్ లాప్సీ తయారైనట్లే...!