సొరకాయ దూధి ఫలూడా

కావలసిన పదార్థాలు :
సొరకాయ(తురుము)... అరకేజీ
పాలు... ముప్పావు లీ.
పంచదార... వంద గ్రా.
మంచినీరు... అర లీ.
గ్రీన్ ఫుడ్‌కలర్... మూడు చుక్కలు
వెనీలా ఎసెన్స్... ఒక టీ.

తయారీ విధానం :
పాలను మరిగించి, పంచదార కలిపి పక్కన ఉంచాలి. ఓ పాత్రలో మంచినీళ్లు పోసి, సొరకాయ తురుము వేసి మెత్తగా ఉడికించాలి. స్టవ్‌మీద నుంచి దించిన తరవాత నీటిని వంపేసి.. అందులో గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌, వెనీలా ఎసెన్స్ కలపాలి. దీనికి పాలు కూడా కలిపి మీడియం సెగమీద కాసేపుంచి దించేయాలి. అంతే సొరకాయ దూధి ఫలూడా తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి