తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

సెల్వి

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (14:50 IST)
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తప్పేటులేదు. జైశ్వాల్ కమిటీ సిఫార్సుల మేరకు బీర్ బాటిళ్ల ధరలను తెలంగాణ సర్కారు పెంచింది. బీర్ల ధరలు సవరించాలని యునైటెడ్ బేవరేజస్, మరికొన్ని బేవరేజస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి. 
 
అయితే, ఎట్టిపరిస్థితుల్లో బేవరేజస్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. దీంతో ఈ అంశంపై వేసిన కమిటీ కూడా బీర్ల ధరలను 15శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఫలితంగా కాగా ధరలను 33 శాతం పెంచాలని.. లేకుంటే బీర్ల సప్లయ్‌ను కూడా ఆపేస్తామని బేవరేజస్ చెప్పడంతో బీర్ల ధరలు పెంచక తప్పట్లేదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు