అటుకులు : 35 గ్రాములు చక్కెర : 200 గ్రాములు పాలు : 3/8 లీటరు జీడిపప్పు : 25 గ్రాములు ఏలక్కాయలు : ఏడు కుంకుమపువ్వు : చిటికెడు పచ్చకర్పూరం : చిటికెడు నెయ్యి : 5 టీస్పూన్లు
ఇలా చెయ్యండి :
ముందుగా అటుకులను నేతిలో వేయించాలి. అర లీటరు నీళ్లలో ఈ అటుకులను కలిపి మరగపెట్టాలి. ఉడికిన తర్వాత చక్కెర కలపాలి. తరువాత పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కలపాలి. కొలతలను రుచిని బట్టి తీసుకోవాలి.