కేసరి బూరెలు

సోమవారం, 11 జూన్ 2007 (16:59 IST)
కావలసిన పదార్ధాలు :

బొంబాయ్ రవ్వ: ముప్పావు కిలో
బియ్యంపిండి: ఒక కప్పు
మైదా: ఒక కప్పు
పంచదార: 200 గ్రాములు
ఏలకులు: 10 కాయలు
మిఠాయి కలర్: చిటికెడు
నూనె: పావుకిలో
ఉప్పు: చిటికెడు


తయారుచేసే విధానం:

బొంబాయి రవ్వను జల్లించి, ఒక బాణాలిలో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. పావు లీటర్ నీరును బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

అందులో పంచదార, కలర్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.

తరువాత బియ్యం పిండిని మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.

వెబ్దునియా పై చదవండి