కావలసిన పదార్థాలు : క్రీమ్‌మిల్క్... రెండు కప్పులు క్రీమ్... రెండు కప్పులు పాలపొడి... ఒక కప్పు పంచదార... అరకప్పు వెనీలా ఎసెన్స్... ఒక టీ. బూడిదగుమ్మడి తురుము... ఒక కప్పు క్యారెట్ తురుము.. రెండు కప్పులు
తయారీ విధానం : ఒక పాత్రలోకి క్రీమ్‌మిల్క్, క్రీమ్, పాలపొడి, వెనీలా ఎసెన్స్ తీసుకుని బాగా కలిపి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి గడ్డ కట్టేలా చేయాలి. తరువాత క్యారెట్, బూడిద గుమ్మడి తురుములను పంచదారతో కలిపి ఉడికించి చల్లారనివ్వాలి. సర్వ్ చేసే ముందు క్యారెట్ మిశ్రమానికి మధ్యలో పైన డీప్‌ఫ్రీజ్‌లో పెట్టుకున్న పదార్థాన్ని పెట్టి అందించాలి. అంతే చల్లచల్లని క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్ రెడీ అయినట్లే..! తియ్యదనంతోపాటు వేసవి తాపాన్ని కూడా హరించే ఈ స్వీటును మీరు కూడా తయారు చేస్తారు కదూ...!