కావలసిన పదార్థాలు : జీడిపప్పు... ఒక కప్పు ఆక్రోటు పప్పు... ఒక కప్పు పిస్తా పప్పు... ఒక కప్పు బాదంపప్పు... 200 గ్రా. కోవా... 300 గ్రా. పంచదార... మూడు కప్పులు పాలు... రెండు కప్పులు
తయారీ విధానం : ముందుగా 10-12 పిస్తా పప్పుల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి. తరువాత బాదం, జీడిపప్పు, అక్రోటుల్ని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి పాలు పోసి కాగాక కోవా వేసి తక్కువ మంటమీద గరిటెతో తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కరిగించాలి.
పంచదార కరిగాక డ్రైఫ్రూట్స్ పొడి వేసి తక్కువ మంటమీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం గట్టిపడ్డాక ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులోకి వంపాలి. కాస్త చల్లారిన తరువాత దీనిని కొద్ది కొద్దిగా తీసి... చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆపై పిస్తా పొడిలో దొర్లించి ఫ్రిజ్‌లో ఓ రెండు గంటలు ఉంచి తీస్తే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.