రెడీమేడ్ ఆమ్లా మురబ్బాలతో "మిల్క్ రబ్రి"

FILE
కావలసిన పదార్థాలు :
చిక్కటి పాలు.. ఒక లీ.
కోవా.. ముప్పావు కప్పు
పంచదార.. 4 టీ.
పిస్తా... 8
యాలకుల పొడి.. అర టీ.
గులాబీ రేకులు.. కాసిన్ని
రెడీమేడ్ ఆమ్లా మురబ్బా... ఆరు ముక్కలు

తయారీ విధానం :
మందపాటి కడాయిలో పాలను మరిగించి అందులోనే మెత్తగా చిదిమిన కోవా, పంచదార కలపాలి. తక్కువ మంటమీద 45 నిమిషాలపాటు ఉంచి ఉడికించాలి. పాలు సగమై చిక్కగా మారి అంచులకు అంటుకుంటుండగా స్టవ్‌మీద నుంచి దించాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కోసిన పిస్తాపప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. ఆపై ఆమ్లా మురబ్బాను చిన్న చిన్న ముక్కలుగా కోసి రబ్రీలో కలపాలి. చివరగా దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి గులాబీరేకులతో అలంకరించి అతిథులకు అందించాలి.

వెబ్దునియా పై చదవండి