సొరకాయ హల్వా

గురువారం, 28 జూన్ 2007 (16:05 IST)
కావలసిన పదార్ధాలు:
చిన్న సొరకాయ-ఒకటి
పాలు- ఒక లీటర్
జీడిపప్పు- 20గ్రాములు
యాలకులు- 10
కిస్‌మిస్-కాస్త
పంచదార- 300 గ్రాములు


తయారు చేసే విధానం:
సొరకాయ చెక్కుతీసి ముక్కలుగా చేసి కొబ్బరికోరంలో కోరి నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి. ఒక దలసరి గిన్నె పొయ్యిమీద పెట్టి వేడెక్కాక నెయ్యి పోసి కాగిన తరువాత జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి. తరువాత అదే గిన్నెలో మిగిలిన నెయ్యిలో కోరిన సొరకాయను వేసి 10 నిమిషాలు వేయించి, అందులో పాలు, పంచదార వేసి బాగా దగ్గర పడి హల్వాలా అయ్యేవరకు గరిటతో తిప్పాలి. తరువాత స్టౌ ఆపి హల్వాలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడి వేసి కలపాలి.

వెబ్దునియా పై చదవండి