తెలంగాణలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అభినందలు అంటూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో తెరాస నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బంగారు తెలంగాణని మరింత అభివృద్ధి చేయాలని జనసేన ఆంధ్రా యువత శుభాకాంక్షలు తెలిపింది.
అలాగే జనసేనాని పవన్ కల్యాణ్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు కృతజ్ఞతలు చెప్తున్నారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు అడుగుపెట్టిన తర్వాతే ప్రజా కూటమికి చుక్కలు కనిపించాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేసి వుంటే 35 సీట్లు వచ్చేవేమోనని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా చంద్రబాబు సార్ రాకతో యుద్ధం ఈజీగా ముగిసిందని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కారు దెబ్బకు సైకిల్ తుక్కు తుక్కు అయ్యిందని జనసేన పార్టీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో కలిసి టీడీపీని తెలంగాణ ప్రజలు పాతాళంలోకి పంపించారని.. జనబలమున్న బాహుబలి పవన్ కల్యాణ్ మద్దతుతోనే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించగలిగిందని.. తెలంగాణ కంటే ఏపీలో పచ్చపార్టీ పరిస్థితి మరీ ఘోరమని జనసేన నేతలు మండిపడ్డారు. అంతేగాకుండా 2019లో జనసేన పార్టీ ఏపీలో బలంగా రుజువు కాబోతోందని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.