ఈయన గతంలో ఉప ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రిగా ఉన్నారు. అలాగే, హోం మంత్రిగా నాయిని నర్శింహా రెడ్డి ఉన్నారు. కానీ, కొత్త ప్రభుత్వంలో అలీకి హోంశాఖను సీఎం కేటాయించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే, కేసీఆర్ మాత్రం నాయిని హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ముఠా గోపాల్‌కు అధిక విజయావకాశాలు ఉన్నట్టు తేలింది. దీంతో ముషీరాబాద్ టిక్కెట్‌ను ముఠా గోపాల్‌కు కేటాయించారు. ఎన్నికల ఫలితాల్లో కూడా ముఠా గోపాల్ విజయం సాధించాడు.