భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...

ఠాగూర్

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:16 IST)
మనస్పర్థల కారణంగా కట్టుకున్న భర్తతో విడిపోయిన ఓ మహిళ.. ఆ తర్వాత పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసిన భర్త కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేయించారు. ఇందుకోసం భారీ మొత్తాన్ని సుపారీ రూపంలో ఖర్చు చేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడ మమత అనే మహిళ తన భర్త భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయి, మంచిర్యాలలో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణిలో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని భర్త భాస్కర్సోదరి నర్మదకు తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడు రఘుతో కలిసి మమత హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ హంతకుడు వేల్పుల కళ్యాణ్‌కు రూ.5 లక్షల వరకు డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మమతను హత్య చేసిన తర్వాత కళ్యాణ్‌కు నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగంలు హంతకుడుకి ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించారు.
 
అయితే, హత్య తర్వాత మమత మృతదేహాన్ని తీసుకెళ్లి, జిల్లాలోని గంగాధర మండలం, కొండన్నపల్లి శివారు ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ చెన్నైకు పారిపోయారు. దీనిపై మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కళ్యాణ్ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసిన నర్మద, ఆమె ప్రియుడు రఘు, నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగులను ఇంటివద్దే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు