ఇటీవల ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని ఫొటో తీసి "కొత్త తెలంగాణ చరిత్ర" బృందం సభ్యుడు రామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్‌కు పంపాడు. వెంటనే వారొచ్చి విగ్రహాన్ని పరిశీలించి ఆ విగ్రహం భక్త రామదాసుదేనని నిర్ధారించారు.
చక్కని మీసకట్టుతో, అప్పుడే తలారా స్నానం చేసి జుట్టును జారుముడి వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడిఎడమ భుజాలపై శంఖుచక్ర ముద్రలు ఉన్నాయి.