గచ్చిబౌలిలో దారుణ హత్య- షాకింగ్ వీడియో వైరల్

సెల్వి

శుక్రవారం, 3 మే 2024 (22:01 IST)
Crime
గచ్చిబౌలిలో దారుణ హత్య చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ వీడియోలో హోటల్ రిసెప్షన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కుర్చీపై కూర్చిండి వుండిన హోటల్ యజమానిపై వెలుపల నుంచి గునపంతో వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. రెండు దెబ్బలకే యజమాని ప్రాణాలు కోల్పోయాడు. 
 
దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ హోటల్‌లోని వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి వుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

గచ్చిబౌలిలో దారుణ హత్య.. లైవ్ వీడియో

గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. pic.twitter.com/kz2TEZtEk2

— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు