మద్యం మత్తులో కండెక్టర్‌పై హైదరాబాద్ మహిళ దాడి.. వీడియో వైరల్

సెల్వి

బుధవారం, 31 జనవరి 2024 (13:42 IST)
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్‌ కండక్టర్‌పై ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తిస్తూ, శారీరకంగా దాడి చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
బస్సు కండక్టర్‌పై మహిళ అసభ్యపదజాలంతో పాటు శారీరకంగా దాడి చేయడం వీడియోలో రికార్డైంది. బస్సులోని ఇతర ప్రయాణికుల పట్ల ఆ మహిళ అసభ్యంగా ప్రవర్తించడం కెమెరాకు చిక్కింది.
 
ఛార్జీల వివాదం లేదా టికెట్ సంబంధిత సమస్య కారణంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. టీఎస్‌ఆర్‌టీసీ మహిళపై ఫిర్యాదు నమోదు చేసింది. మద్యం మత్తులో హైదరాబాద్ మహిళ కండక్టర్‌పై దాడి చేసిందని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు