చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి (Video)

ఠాగూర్

శనివారం, 7 డిశెంబరు 2024 (08:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులో మునిగిపోవడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా, పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంతో వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులోని నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు జలసమాధి అయ్యారు. ఒకరు మాత్రం చెరువు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికి తీసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీలుగా గుర్తించారు. 

 

ఘోర ప్రమాదం

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం.. ఒక్కరి పరిస్థితి విషమం pic.twitter.com/r0CRg1Lh6e

— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు