ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా (Vide)

ఠాగూర్

బుధవారం, 8 జనవరి 2025 (10:27 IST)
ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో యాజమాన్యం టిఫిన్ పెట్టారు. 
 
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టారు. అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించకపోవడంతో యాజమాన్యంతో విద్యార్థులు గొడవకి దిగారు. 
 
దీనిపై అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం కోసం 32,000 రూపాయలను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం పెడతారా అని ప్రశ్నించారు. వారెవ్వా ప్రజాపాలన. శబాష్ ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ తెలిపారు. 

 

ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు ₹32,000 మాత్రమే !!

చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం

వారెవ్వా ప్రజాపాలన. శబాష్ ఇందిరమ్మ రాజ్యం ???????? https://t.co/8d3ca979Op

— KTR (@KTRBRS) January 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు