ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఠాగూర్

గురువారం, 31 జులై 2025 (14:37 IST)
హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేటు ప్రైమరీ స్కూలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తోంది. ఏబీసీడీలు నేర్పించేందుకు ఏకంగా రూ.2.51 లక్షలు వసూలు చేస్తోంది. నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షలు చొప్పున సదరు స్కూలు వసూలు చేస్తోంది. ఈ పాఠశాల వసూలు చేస్తున్న ఫీజుల వివరాలకు సంబంధించిన ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెల నెలా రూ.21 వేలు చెల్లించాలని వారు పేర్కొంటున్నారు. ఇంత భారీగా వసూలు చేస్తున్న ఫీజుకు స్కూలు యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని, ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా ఏం నేర్పిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. ఫీజుల వివరాలకు సంబంధించిన పేపర్‌ను ఫోటో తీసి అనురాధ తివారీ అనే యూజర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది. 
 
ఈ లెక్కన మధ్య తరగతి ప్రజల కష్టార్జితం మొత్తం స్కూలు ఫీజులకు సరిపోయేలా లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తూ ఇదంతా పెద్ద స్కామ్‌గా మారిందని స్కూలు యాజమాన్యాలు పిల్లలు తల్లిదండ్రులను దోచుకుంటున్నారని కొంతమంది వాపోయారు.  ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు