తనను ప్రేమించాలంటా ఓ యువతికి ఓ యువకుడు బెదిరించాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో తనలోని మరో కోణాన్ని ఆ యువకుడు బయటపెట్టాడు. నన్ను ప్రేమిస్తే సరేసరి.. లేదంటే నువ్వు కాల్‌గార్ల్ వంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ హెచ్చరించాడు.
ఇలా అనునిత్యం వేధిస్తుండటంతో భరించలేని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్ జూబ్లీహి్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కృష్ణానగర్‌కు చెందిన 20 యేళ్ల యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.
రెండేళ్ల క్రితం ఆమెకు ఇందిరా నగర్‌కు చెందిన ఖయ్యూంతో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో తన అవసరాల నిమిత్తం అతడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని, ఆ తర్వాత వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేసింది.
ఆ తర్వాత నుంచి ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. దీనికి ఆమె నో చెప్పింది.
అప్పటి నుంచి ఖయ్యూం ఆమెపై కక్ష పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక ఆమె ఇంటికి వెళ్లి ఫోన్ లాక్కొని, స్కూటర్‌ను ధ్వంసం చేశాడు.
ఈ నెల 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో యువతి ఇంటికి వెళ్లి బయట నుంచి పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడాడు. ప్రేమించకుంటే కాల్‌గర్ల్‌వని ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.