అమెరికాలో రోడ్డు ప్రమాదం... తెలుగు యువకుడు మృతి

ఠాగూర్

మంగళవారం, 9 జనవరి 2024 (08:58 IST)
అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మృతుడు స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడుని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన  సాయి రాజీవ్ రెడ్డి (28)గా గుర్తించారు. టెక్సాస్ విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్శిల్ తీసుకొస్తుండగా, రాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన రాజీవ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. 
 
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, వీఎంబంజర్‌కు చెందిన సాయి రాజీవ్ రెడ్డి గత కొంతకాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సాస్‌లోనే ఉంటుంది. కొడుకు మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తండ్రి ముక్కర భూపాల్ రెడ్డి సోమవారం హుటాహుటిన అమెరికాకు బయలుదేరి వెళ్లాడు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని, కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, రాజీవ్ రెడ్డికి రెండున్నరేళ్ల క్రితమే వివాహమైంది.
 
చేనులో పత్తి తీస్తుండగా పెద్దపులి దాడి.. మహిళ మృతి.. ఎక్కడ? 
 
పెద్ద పులి చేసిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు పత్తి చేనులో పత్తి తీస్తుండగా ఈ పులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ చనిపోయింది. మృతురాలిని 50 యేళ్ల సుష్మగా గుర్తించారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని అహేరి తాలూకా చింతల్‌పేట్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహేరి తాలూకా చింతల్‌పేట్ శివారా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చేనులో పత్తి తీస్తుండగా, ఆదివారం ఉదయం 11 గంటల యమంలో పులి వెను నుంచి వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుష్మ మండల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, ఆమెతో పాటు పత్తి తీస్తున్న ఇతర మహిళా కూలీలు బిగ్గరగా కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. మృతురాలికి గ్రామంలో కిరాషా దుకాణం ఉంది. ఈ షాపును నడుపుకుంటూనే వ్యవసాయ పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో చేనులో పత్తి తీసేందుకు వెళ్ళగా ఈ దారుణం జరిగింది. కాగా, అహేరి జిల్లాలో గత ఐదు రోజుల్లో పులులు దాడులు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
 
హీరోయిన్ నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకో తెలుసా? 
 
సీనియర్ హీరోయిన్ నయనతారపై ముంబై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఓ చిత్రంలో నటించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల నయనతార నటించిన తాజా చిత్రం "అన్నపూరిణి". ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో రాముడిని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
 
'అన్నపూరిణి' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రం లవ్ జిహాద్‌ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. 'అన్నపూరిణి' చిత్ర నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
 
ఈ చిత్రంలో ఓ హిందూ పూజారి కుమార్తె నమాజు చదవడం, బిర్యానీ వండడం చూపించారని రమేశ్ సోలంకి వెల్లడించారు. ఇందులో ఫర్హాన్ (నటుడు) ఓ నటిని మాంసం తినాలని కోరతాడని, శ్రీరాముడు కూడా మాంసాహారేనని ఆమెతో చెబుతాడని వివరించారు. త్వరలో అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరగనుండడంతో జీ స్టూడియోస్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రాన్ని తీసుకువచ్చాయని రమేశ్ సోలంకి ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో... అన్నపూరిణి దర్శకుడు నీలేశ్ కృష్ణ, హీరో జై, హీరోయిన్ నయనత తార, నాడ్ స్టూడియోస్ అధినేత జతిన్ సేథీ, ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత ఆర్.రవీంద్రన్, జీ స్టూడియోస్ ప్రతినిధి పునీత్ గోయెంకా, ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు షరీఖ్ పటేల్, మోనికా షేర్ గిల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రమేశ్ సోలంకి పోలీసులను కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు