ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగ్ మాయం... (Video)

ఠాగూర్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (19:44 IST)
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో రూ.23 లక్షల నగదు బ్యాగు కనిపించకుండా పోయింది. ఈ నగదు బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి బస్సులోకి వచ్చి చూడగా ఆ బ్యాగు కనిపించకుండా గుర్తు తెలియని దొంగు ఒకరు ఎత్తుకెళ్లిపోయారు.  
 
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనాల కోసం ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో రూ.23 లక్షలున్న బ్యాగును వెంకటేష్ అనే ప్రయాణికుడు తీసుకెళుతున్నాడు. 
 
టిఫిన్ చేసేందుకు బస్సును ఆపగా, వెంకటేష్ బ్యాగును బస్సులోనే పెట్టి హోటల్‌కు వెళ్లాడు. అదే అదునుగా చూసి రూ.23 లక్షల బ్యాగును దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. ఆంధ్రప్రదేశ్ - బాపట్లకు చెందిన వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్తుండగా చోరి జరిగింది. నార్కట్ పల్లి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


 

23 లక్షల బ్యాగును బస్సులో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి.. డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లిన దొంగ

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ దగ్గర భోజనాల కోసం ఆపిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్… pic.twitter.com/jwnKIfMbog

— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు