ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే కోడి తానదేనంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదేనంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన వెల్లగక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ బతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్టుగా చెప్పాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్‌ని వేడుకున్నాడు.