సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

ఠాగూర్

ఆదివారం, 19 అక్టోబరు 2025 (11:06 IST)
సంత్రాగచ్చి - చర్లపల్లి ప్రాంతాల మధ్య నడిచి ప్రత్యేక రైలులో వచ్చిన ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఐదు రోజుల క్రితం ఈ దారుణం జరిగితే ఆలస్యంగా వచ్చింది. పోలీసులు దర్యాప్తులో వెల్లడైన కథనాల మేరరకు.. ఐదు రోజుల క్రితం సత్రాంగచ్చి చర్లపల్లి ప్రత్యేక రైలులో మహిళపై అత్యాచారం జరిగినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ఇందులో అత్యాచారం అనంతరం నిందితుడు రాజారావు పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో అక్కడ దిగిపోయి పత్తిచేల మీదుగా నడుచుకుంటూ వెళ్లి సత్తెనపల్లి బస్సెక్కాడు. బాధితురాలి నుంచి గుంజుకున్న సెల్‌ఫోను అక్కడ విక్రయించి వచ్చిన డబ్బుతో బిర్యానీ తిన్నాడు. అనంతరం అక్కడే రైలెక్కి గుంటూరు వచ్చి నగర వీధుల్లో రెండుగంటలపాటు చక్కర్లు కొట్టాడు. 
 
తర్వాత మరో రైలెక్కి తెనాలిలో దిగాడు. బాధితురాలి సిమ్ కార్డును తన ఫోనులో వాడడంతో టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. గత మూడు రోజుల విచారణలో నిందితుడు అనేక అంశాలు వెల్లడించినట్టు తెలిసింది. ఎనిమిది నెలల క్రితం కేరళకు చెందిన ఓ మహిళపైనా అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆది, సోమవారాలు సెలవు కావడంతో నిందితుడిని మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు