శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఠాగూర్

మంగళవారం, 17 డిశెంబరు 2024 (18:37 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందనే, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. 
 
గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. అలాగే, ప్రభుత్వం తరపున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాలు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజ్ జరిగిందని వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించారు. చిత్ర హీరో అల్లు అర్జున్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. 

 

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీ తేజ్ కుబ్రెయిన్ డమేజ్ జరిగింది, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది

ట్రెట్ మెంట్ సుదీర్ఘంగా సాగె అవకాశం ఉంది,త్వరలో శ్రీ తేజ్ ఆరోగ్యం పై వైద్యులు buliten విడుదల చేస్తారు#AlluArjun #SriTej #CVAnand #Hyderabad pic.twitter.com/4LsQxWHGKC

— TV5 News (@tv5newsnow) December 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు