అమ్మబాబోయ్.. ఎముకలు కొరికే చలి... హైదరాబాద్‌‍లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఠాగూర్

సోమవారం, 16 డిశెంబరు 2024 (12:15 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలోనూ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో నగర వాసులు చలికి వణికిపోతున్నారు. మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్ఈఎల్లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2 డిగ్రీలు, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడ్ పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్ 10.2, మచ్చ బొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్ చెరులో 11.7, షాపూర్ నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయినపల్లి 11.9, బేగం పేట 12, ఆసిఫ్ నగర్ 12, నేరెడ్మెట్ 12.1, లంగర్ హౌస్ 12.2 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
అలాగే, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్పేట 12.8, మాదాపూర్ 12.8, ముషీరాబాద్ 12.9, చాంద్రాయణగుట్ట 13, కూకట్పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్ గూడ 13.3, హయత్ నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శనగర్ 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుమలగిరిలో 13.6, చర్లపల్లిలో 13.6 డిగ్రీలు నమోదయ్యాయి. తాండ్ర(నిర్మల్) లో 6.3 డిగ్రీలు, పోచర(ఆదిలాబాద్) 6.4, జైనథ్(ఆదిలాబాద్) 6.5, అర్లి(టి) ఆదిలాబాద్) 6.6, చాప్రాల్ (ఆదిలాబాద్) 6.6, సత్వార్ (సంగారెడ్డి) 6.6, బంట్వారం(వికారాబాద్) 6.7, న్యాల్కల్(సంగారెడ్డి) 6.7 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు