తెలుగు రాష్ట్రాల్లో ఓ కారులో తిరుగుతూ చితాభస్మాన్ని శరీరానికి రాసుకుంటూ, విపరీతమైన రద్దీ ప్రాంతాల్లో రోడ్డుపై దిగి పోలీసులకు చుక్కలు చూపించే అఘోరీ గురించి పరిచయం అక్కర్లేదు. గత కొన్నిరోజులుగా ఈ అఘోరీ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ అఘోరీ ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోస వెళితే అక్కడే వున్న రాజేష్ నాథ్ అనే వ్యక్తి చితకబాదాడు. అతడలా చితక బాదుతున్నా అఘోరీ మాత్రం అతడి దెబ్బలు తింటూ మౌనంగా వుంది. ఇపుడీ వీడియో లీక్ అయ్యింది. వర్షిణి, రాజ్ నాధ్, అఘోరీల మధ్య వున్న సంబంధం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది.
మరోవైపు అఘోరీ నాకు అమ్మ అంటూ ఓ బీటెక్ విద్యార్థిని వీడియోలో చెబుతోంది. తను కూడా అమ్మ దారిలో అఘోరీ అవుతాననీ, ఆమె చెప్పిన నిబంధనలన్నీ పాటిస్తానంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.