జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా సంస్థలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. దీని వెనుక కారణం వెల్లడించనప్పటికీ శంషాబాదు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఓ యువతి తన అండర్వేర్‌లో మూడు లైటర్లు పెట్టుకుని విమానం ఎక్కబోయింది.
కస్టమ్స్ అధికారుల కన్నుగప్పేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ బీప్ అనే శబ్దం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. దాంతో ఆమె అండర్వేర్లో మూడు లైటర్లు వున్నట్లు కనుగొన్నారు. వీటిని చూసి షాక్ తిన్నారు. వీటికి మండే గుణం వుంది. విమానాల్లో వీటిపై నిషేధం వున్నప్పటికీ ఆమె ఎందుకు వాటిని తీసుకుని వెళ్లాలనుకున్నది అని ఆరా తీస్తున్నారు. పైగా బయట మార్కెట్లో 100 రూపాయలకే దొరికే ఈ లైటర్లను అతి జాగ్రత్తగా అలా తీసుకెళ్లడం వెనుక కుట్ర దాగి వుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయాణీకులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయ రక్షణను బలోపేతం చేయడానికి కఠినమైన పర్యవేక్షణ ప్రోటోకాల్‌లు అమలు చేయబడ్డాయి.