2011 రైల్ రోకో కేసు.. కేసీఆర్‌కు ఊరట.. వచ్చేనెల 18కి వాయిదా

సెల్వి

మంగళవారం, 25 జూన్ 2024 (17:49 IST)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు మంగళవారం ఊరట ఇచ్చింది. 2011 రైల్ రోకో కేసులో కేసీఆర్ పై విచారణపై హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను వచ్చేనెల 18కి వాయిదా వేసింది.
 
రైల్ రోకో కార్యక్రమంలో తాను పాల్గొనలేదని, తనపై తప్పుడు కేసు పెట్టారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసీఆర్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
 
2011లో తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో నిర్వహించింది టీఆర్ఎస్. అందులో భాగంగా రైల్వే శాఖ కేసు పెట్టింది. ఈ కేసులో కేసీఆర్ పేరు కూడా వుంది. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని కేసీఆర్ కోర్టుకు తెలిపారు. ఇది తప్పుడు కేసు అని.. దీన్ని కొట్టివేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు