తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం సరికాదు, భారాసకి ఇక గడ్డు కాలమే: రాజయ్య

ఐవీఆర్

శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:43 IST)
భారాసకి వీరవిధేయుడిగా వుండే టి. రాజయ్య ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీకి భవిష్యత్ అంతా గడ్డుకాలం ఎదురుకాబోతోందని జోస్యం చెప్పారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా తమ సామాజిక వర్గంపై కేసీఆర్ పెద్ద దెబ్బ వేసారని ఆయన అన్నారు. ప్రజాబలంతో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సహేతుకమైనవి కావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఆ పార్టీ మరింత దిగజారిపోతుందని, ప్రజల్లో విలువ లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
తనకు టిక్కెట్ ఇవ్వలేదనీ, ఐనా తమతో మాట్లాడుతారని ఆరు నెలలుగా ఎదురుచూసాననీ, ఇక ఓపిక లేక భారాసకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలన్నదానిపై తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా రాజయ్య ఫిబ్రవరి 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు