హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సిద్దిపేట ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) గా గుర్తించారు. "జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను... ప్రేమలో విఫలమయ్యాను... నా మరణానికి ఎవరూ బాధ్యులు కాదు" అని మహేందర్ నోట్‌లో రాశారు.
వివరాల్లోకి వెళితే, మహేందర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మహేందర్ కేపీహెచ్‌బీలోని అడ్డగుట్టలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, అతను పండుగకు తన ఇంటికి వెళ్ళలేదు. అతను ఒక రోజు కూడా గది నుండి బయటకు రాకపోవడంతో, హాస్టల్ యాజమాన్యం తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లింది.