రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

ఠాగూర్

గురువారం, 20 మార్చి 2025 (14:08 IST)
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో నానాటికీ ధన ఆశ పెరిగిపోయింది. ముఖ్యంగా, భార్యాభర్తలు కూడా డబ్బు ఆశలోపడి తమ పండంటి సంసార జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోంది. ఆపై నిత్యం వేధింపులు గురిచేస్తోందని శ్రీకాంత్ అనే టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ప్రశాంతంగా ఉద్యోగం కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతోందని వాపోతున్నాడు. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరశీలిస్తే, శ్రీకాంత్ ఓ యువతితో 2022లో వివాహమైంది. సంపిగెహళ్లిలో కాపురం పెట్టారు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న అతడిని భార్య నిత్యం వేధిస్తుంది. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తోంది. అకారణంగా దూషిస్తుంది. కాపురం చేయాలంటే షరతులు పెడుతోంది. 
 
అడిగినన్ని డబ్బులు ఇవ్వకున్నా, చెప్పింది చేయకున్న బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరింపులకు దిగుతోంది. కనీసం విడాకులు ఇవ్వమన్నా రూ.45 లక్షలు డిమాండ్ చేస్తుంది. అయితే, దీనిపై అతడి భార్య కథనం మరోలా ఉంది. మరో పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు