వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

ఠాగూర్

మంగళవారం, 15 జులై 2025 (09:08 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వివాదంలో ఉంది. ఈ ఇంటిని క్రమబద్దీకరించాలని ఆయన ఎప్పటి నుంచో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను కోరుతున్నారు. అయినా అధికారుల్లో స్పందన లేదు. దీంతో చిరంజీవి పెట్టుకున్న దరఖాస్తుపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్‌రు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 455ఏఏ కింద జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని తన ఇంటిని క్రమబద్దీకరించాలంటూ జూన్ 5వ తేదీన చిరంజీవి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు... ఆ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు