చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

ఐవీఆర్

బుధవారం, 14 మే 2025 (17:02 IST)
ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు మే నెల 31వరకూ జరుగనున్నాయి. ఇదిలావుంటే పోటీలో పాల్గొనే సుందరీమణులు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వారు చార్మినార్ వద్దకు వెళ్లారు.
 
ప్రపంచ సుందరీమణులు చార్మినార్ వద్దకు వస్తున్నారని తెలిసి జిహెచ్ఎంసి అధికారులు హుటాహుటిన వీధి కుక్కలను పట్టుకెళ్లేందుకు సిబ్బందిని పురమాయించారు. ప్రపంచ సుందరీమణులు చార్మినార్ వద్దకు వచ్చే ముందుగానే వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకుండా అన్నింటిని ఉచ్చులు వేసి పట్టుకెళ్లిపోయారు.

అందాల భామలకు వీధి కుక్కలు కనపడొద్దని 50 కుక్కల్ని పట్టుకున్న జీహెచ్‌ఎంసీ https://t.co/nqICQidKJW pic.twitter.com/LIymhjucS8

— Telugu Scribe (@TeluguScribe) May 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు